![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -87 లో.....గంగ దగ్గరున్న డబ్బు మణి తీసుకొని వెళ్తాడు. అప్పుడే లక్ష్మీ వస్తుంది. ఇంత లేట్ అయిందని అడుగుతుంది. వర్క్ బాగా ఉందని గంగ చెప్తుంది. నా ఫ్రెండ్స్ ని కలిసి వస్తానని గంగ వెళ్తుంది. తన ఫ్రెండ్ శ్రీను అన్న దగ్గరికి వెళ్లి నాకు ఏమైనా వర్క్ ఉంటే చెప్పండని అడుగగా.. ఉందని అతను చెప్తాడు.
మరొకవైపు పారు ఫోటో చూస్తూ రుద్ర తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సూర్య ఫోన్ చేసి రుద్ర నీతో మాట్లాడాలని చెప్పి పడిపోతాడు. తన పక్కనున్న అతను ఫోన్ తీసుకొని ఎవరో సర్ ఫోన్ కావాలంటే ఇచ్చానని అతను చెప్తాడు. సరే నేను వస్తున్నానని అడ్రెస్ చెప్పమని అంటాడు. అడ్రెస్ చెప్పగానే రుద్ర బయల్దేరి వెళ్తుంటే వీరు ఆపి ఎక్కడికి అని అడుగుతాడు. పూర్ణ జంక్షన్ దగ్గర వర్క్ ఉందని చెప్పి రుద్ర వెళ్తాడు. వీరు తన మనుషులకి పూర్ణ జంక్షన్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత గంగ ఒక హోటల్ దగ్గర పని చేస్తుంది. అక్కడ రౌడీలు తనని ఏడిపిస్తుంటే వాళ్ళని గంగ కొడుతుంది.
ఆ తర్వాత సూర్యని ఒకతను గంగ ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇతని కోసం ఒకతను వస్తానని చెప్పాడు. నాకు వర్క్ ఉందని అతను వెళ్ళిపోతాడు. రుద్ర సర్ అని సూర్య అంటుంటే రుద్ర సర్ అంటున్నాడు ఏంటి.. సర్ కి ఏమైనా చెప్పాలేమోనని తన ఓనర్ ని వీడియో రికార్డు చెయ్యమని చెప్తుంది. సూర్య మాట్లాడుతుంటే అతను రికార్డు చేస్తాడు. నేను నీకు చాలా చెప్పాలి. ఇదంతా మా అన్నయ్య చేస్తున్నాడని చెప్తాడు. మా అన్నయ్య ఎవరో కాదని చెప్పబోతుంటే వాడిని ఏసేయండి రా అంటూ వీరు మనుషులు వస్తారు. తరువాయి భాగంలో రుద్ర టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చి సూర్య గురించి అడుగుతాడు. రుద్రకి కనిపించకుండా గంగ టవల్ కట్టుకుంటుంది. ఓనర్ కి ఆ వీడియో సర్ కి చూపించమని గంగ చెప్పగానే అతను సూర్య చెప్పిన వీడియో చూస్తాడు. ఆ తర్వాత రుద్ర సూర్య కోసం వెతుకుతుంటే మక్కం కన్పిస్తాడు. ఇక్కడ ఏంటి అని రుద్ర అడుగుతాడు. గంగ ఇక్కడే పని చేస్తుందని మక్కం చెప్పగానే గంగని రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |